IGNOU బీఈడీ అడ్మిసన్ 2025 చివరి తేదీ (IGNOU bed Admission 2025 Last Date) : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd), పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ BScN (PB) కోర్సులకు దరఖాస్తులను కోరుతుంది. ఈ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులు (IGNOU bed Admission 2025 Last Date) ఇప్పుడు జనవరి 2025 సెషన్‌కు తెరవబడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక IGNOU వెబ్‌సైట్ ignou.ac.in లో దరఖాస్తు ఫార్మ్‌లను పూరించవచ్చు. అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, హార్డ్ కాపీ రూపంలో ఎటువంటి దరఖాస్తు ఫార్మ్ అంగీకరించబడదు. అన్ని దరఖాస్తులను సాఫ్ట్ కాపీలోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇగ్నో జనవరి 2025 సెషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply IGNOU January 2025 Session)
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో బీఈడీ, నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ అందించడం జరిగింది.
- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ignou.ac.in సందర్శించండి.
- స్టెప్ 2: మీకు నచ్చిన ప్రోగ్రామ్ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. (లేదా మీకు ఇప్పటికే అకౌంట్ ఉంటే మీ ఆధారాలను నమోదు చేయాలి).
- స్టెప్ 4: దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. సేవ్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి.అనంతరం ఫీజు చెల్లించాలి.
- స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
ఇగ్నో ముఖ్యమైన తేదీలు 2025 (IGNOU Important Dates 2025)
ఇగ్నో దరఖాస్తులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది.
IGNOU బీఈడీ, నర్సింగ్ కోర్సుల కోసం ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు 200లు పే చేయాలి. అప్లికేషన్ ఫీజు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా చెల్లించవచ్చు.
IGNOU BEd అడ్మిషన్ 2025 అర్హత ప్రమాణాలు (IGNOU BEd Admission 2025 Eligibility Criteria)
ఇగ్నోలో బీఈడీ, నర్సింగ్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులకు ఈ దిగువున తెలిపన అర్హత ప్రమాణాలు ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ /లేదా సైన్సెస్/ సోషల్ సైన్సెస్/ కామర్స్/ హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు. 55 శాతం మార్కులతో సైన్స్, మ్యాథమెటిక్స్‌లో స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ లేదా దానికి సమానమైన ఏదైనా ఇతర అర్హతలుండాలి.
- ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బీఈడీ కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
- ముఖాముఖి మోడ్ ద్వారా NCTE గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులవుతారు.
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC (నాన్ క్రీమీ లేయర్)/PWD అభ్యర్థులకు కనీస అర్హతలో 5 శాతం మార్కుల రిజర్వేషన్, సడలింపు అందించబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.