తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇకపై నాన్ లోకల్ అభ్యర్థులకు కన్వీనర్ కోటా సీట్లు లేనట్లేనా?: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 290 కుపైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రతీ సంవత్సరం 1,15,000 ఇంజనీరింగ్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నాన్ లోకల్ కోటాలో 15% సీట్లను కన్వీనర్ కోటాలో అందిస్తున్నారు. దాదాపు 15,000 నుండి 16,000 సీట్లు నాన్ లోకల్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ద్వారా భర్తీ అవుతున్నాయి, ఇవి కాకుండా మరో 35,000 సీట్ల వరకూ జనరల్ కేటగిరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కౌన్సెలింగ్ లో ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకూ నాన్ లోకల్ కోటాలో తెలంగాణ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీట్లు ఫిల్ అయ్యాయి, అయితే ఈ సంవత్సరంతో ఈ చట్టం గడువు పూర్తి అవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తవడానికి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్రపతి అనుమతి లభిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉండవు. దీంతో తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఎక్కువశాతం మిగిలిపోయే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ సీట్లను పొందే అవకాశం ఉన్నా కూడా మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గు చూపే విద్యార్థులు చాలా తక్కువమంది ఉంటారు.
తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య (No. Of Engineering Seats Avilable in Telangana)
తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను క్రింది టేబుల్ లో వివరంగా చూడవచ్చు.