తెలంగాణ పాలిసెట్ రిజిస్ట్రేషన్ విధానం 2025 (TS POLYCET Registration Process 2025) : తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ
(TS POLYCET Registration Process 2025) మార్చి 19 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు TS POLYCET 2025కి సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో polycet.sbtet.telangana.gov.in పూరించవచ్చు. తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష మే 13న జరుగుతుంది. అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా TS POLYCET ఏప్రిల్ 19 వరకు చేసుకోవచ్చు. తెలంగాణ పాలిసెట్ దరఖాస్తును పూరించే విధానం, డైరెక్ట్ లింక్, అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను ఇక్కడ చూడండి. కాగా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు రూ.250 ఫీజు చెల్లించాలి. మిగిలిన అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
TS POLYCET దరఖాస్తుని 2025 ఎలా పూరించాలి? (How to fill TS POLYCET Application Form 2025?)
తెలంగాణ పాలిసెట్ 2025కి దరఖాస్తు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ఈ దిగువున అందించాం. అభ్యర్థులు ఈ విధానాన్ని ఫాలో అయి దరఖాస్తు చేసుకోవచ్చు.
- TS POLYCET అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in 2025ని సందర్శించాలి.
- హోంపేజీలో నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన ఫీల్డ్‌లలో పేరు, జెండర్, ఈ మెయిల్ ఐడీ, ఇతర వ్యక్తిగత వివరాలను అందించాలి.
- పేర్కొన్న స్పెసిఫికేషన్ల ప్రకారం లాగిన్ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- వాటితో లాగిన్ అయి అక్కడ ఓపెన్ అయ్యే పేజీలో కమ్యూనికేషన్ వివరాలు, విద్యా అర్హత, పరీక్షా కేంద్రం ప్రాధాన్యత, ఇతర వివరాలను నమోదు చేయాలి. .
- స్పెసిఫికేషన్ల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటంుది.
- అన్ని వివరాలను ప్రివ్యూ చేసి, TS POLYCET దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
TS POLYCET పరీక్ష తేదీ 2025 (TS POLYCET Exam Date 2025)
తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష మే 13న పరీక్షను జరుగుతుంది. TS POLYCET ఆఫ్‌లైన్ పద్ధతిలో అంటే పెన్ పేపర్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కోసం TS POLYCET 2025 పరీక్షా విధానాన్ని, సిలబస్‌ను చూసుకోవాలి. దరఖాస్తుదారులు పరీక్షలో అడిగే ముఖ్యమైన అంశాలు, అధ్యాయాలను చెక్ చేయడానికి TS POLYCET మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాల PDFని కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.