SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీ 2025 (SSC CGL Tier 2 Final Answer Key Out) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీ 2025ని రిలీజ్ చేసింది. అభ్యర్థులు మార్చి 18న సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 17, 2025 (సాయంత్రం 6 గంటల వరకు) వారి రిజిస్ట్రేషన్ ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in నుంచి ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. SSC CGL టైర్ 2 పరీక్ష జనవరి 18వ తేదీ నుంచి జనవరి 20, 2025 వరకు దేశంలోని బహుళ పరీక్షా కేంద్రాలలో జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీతో పాటు అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థుల మార్కులు కూడా విడుదలయ్యాయి. SSC CGL ఆన్సర్ కీ అభ్యర్థులు తమ పనితీరును అంచనా వేయడానికి, పోటీలో వారి స్థానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీ 2025ను ఎలా చెక్ చేయాలి? (How to Check SSC CGL Tier 2 Final Answer Key 2025)
SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీ 2025ను చెక్ చేసుకునే విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది.
- స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను ssc.nic.in సందర్శించాలి.
- స్టెప్ 2: SSC SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీ 2025 పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: రిజిస్ట్రేషన్ నెంబ్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- స్టెప్ 4: SSC CGL టైర్ 2 ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు తమ సమాధానాలను ధ్రువీకరించుకుని ఆన్సర్ కీని ఉపయోగించి వారి అంచనా స్కోర్‌లను లెక్కించుకోవచ్చు. ఏవైనా తేడాలు, లోపాలుంటే మరిన్ని వివరాల కోసం వారు SSC మార్గదర్శకాలను చూడవచ్చు. అదే విధంగా SSC CGL పరీక్ష బహుళ షిఫ్ట్‌లలో నిర్వహించడం జరిగింది కాబట్టి, సెషన్‌ల మధ్య ప్రశ్న కష్టంలో తేడాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సాధారణీకరణ సమానమైన అంచనా ప్రమాణాలను సమర్థిస్తుంది. కాగా SSC CGL టైర్ 2 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా జనవరి 18, 19, 20,31, 2025 తేదీలలో నిర్వహించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం కాలేజ్ దేఖోని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.