రుద్రవేణి అండలూరి ఒక అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రైటర్, ఎడిటర్. ప్రస్తుతం కాలేజ్ దేఖోలో కంటెంట్ అసిస్టెంట్ మేనేజర్, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తెలుగులో ఎడ్యుకేషన్‌ని కంటెంట్‌ని అందిస్తుంటారు. ఇందులో రిక్రూట్‌మెంట్, ఎంట్రన్స్, జాబ్ నోటిఫికేషన్స్, అకడమిక్ వార్తలు, ఆర్టికల్స్ రాయడం, ఎడిట్ చేయడం వంటివి ఉన్నాయి.
రుద్రవేణి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు తర్వాత సబ్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె మంచి జర్నలిస్ట్ కూడా. ఏదైనా విషయాన్ని వాస్తవిక దృక్పథంతో చూసే జర్నలిస్ట్. జర్నలిస్ట్‌గా, ఆమె సత్యాలను, నిజ జీవితాలను అందరికీ తెలియజేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. దృష్టి పెడతారు.
దశాబ్దానికి పైగా తన ప్రయాణంలో, ఆమె రైటర్‌గా, సంపాదకురాలు, జర్నలిస్ట్‌గా అనేక మీడియా సంస్థలతో పనిచేశారు. స్థానిక దినపత్రికలో సాధారణ DTP ఆపరేటర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ కంటెంట్ రైటర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. పట్టుదల ద్వారా మీరు ఏ వృత్తిలోనైనా రాణించగలరని ఆమె గట్టిగా నమ్ముతారు.
చదువు తర్వాత, ఆమె ఆంధ్రజ్యోతి డైలీ పేపర్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె మొదట ఆంధ్ర జ్యోతి జర్నలిజం కళాశాలలో చేరి ఆరు నెలలు శిక్షణ తీసుకున్నారు. ప్రిన్సిపాల్, రచయిత యార్లగడ్డ రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో ఆమె అక్కడ శిక్షణను పూర్తి చేశారు. తర్వాత ఆమె అదే సంస్థలో దాదాపు నాలుగు సంవత్సరాలు తన వృత్తిని కొనసాగించారు.
ఆ తర్వాత ఆమె 10TVలో రెండు సంవత్సరాలు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. అక్కడ ఆమె ప్రత్యేక కథనాలు (ఫోకస్) రాశారు. తర్వాత ఆమె రాజ్ న్యూస్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో చేరి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గోపీనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో 'రాజ్ న్యూస్ క్లోజ్ అప్' అనే బులెటిన్‌ను నిర్వహించారు.
లోకల్ యాప్‌లో సృజనాత్మక కంటెంట్ రచయితగా చేరి రాజకీయ వార్తలు, విశ్లేషణాత్మక కథనాలను రాశారు. ఆ తర్వాత, ఆమె సమయం తెలుగు వెబ్‌సైట్ (టైమ్స్ ఇంటర్నెట్)లో చేరారు. అక్కడ ఆమె జాతీయ, అంతర్జాతీయ వార్తలను రాశారు. ఆమె వృత్తిపరమైన ప్రయాణంలో ఆమె చాలా మంది మేధావులను, తెలుగు రచయితలను కలుసుకున్నారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు.
ఆమె హాబీలు పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం. ఆమె మంచి సినిమాలు చూడడమే కాకుండా వాటిపై సమీక్షలు రాస్తారు. అంతేకాదు ఏ పనిలోనైనా తన సొంత అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యక్తపరచడానికి ఆమె వెనుకాడదు.
ఏ వృత్తిలోనైనా మహిళలు తమను తాము నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. మీడియా రంగంలో కూడా అసమానత, వివక్షతలు ఉన్నాయి. ఆమె వాటిని ఎదుర్కొంటూనే తన కెరీర్‌లో ఎదిగారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె తన కెరీర్‌ను ఎప్పుడూ వదులుకోలేదు.