AISSEE 2025 సైనిక్ స్కూల్ ఇంటిమేషన్ స్లిప్ 2025 (AISSEE 2025 Sainik School City Intimation Slip) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్చి 12న AISSEE 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు ఇప్పుడు exams.nta.ac.in/AISSEE/ లేదా nta.ac.in, అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిటీ స్లిప్‌ను (AISSEE 2025 Sainik School City Intimation Slip) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం ఈ సిటీ స్లిప్ పరీక్షా కేంద్రం ఉన్న పరీక్షా నగరం ముందస్తు సమాచారం మాత్రమే. అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలవుతాయి. AISSEE 2025 భారతదేశంలోని వివిధ కేంద్రాలలో ఏప్రిల్ 5, 2025న నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి సిటీ ఇంటిమేషన్ స్లిప సహాయపడటానికి ఈ స్లిప్ జారీ చేయబడింది. కాగా ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు కూడా త్వరలో విడుదల చేయడం జరుగుతుంది.
AISSEE 2025 పరీక్షను NTA ఏప్రిల్ 5న దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. AISSEE 2025 సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీలని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
AISSEE 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download AISSEE 2025 City Intimation Slip?)
సైనిక్ స్కూల్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక AISSEE వెబ్‌సైట్‌కి exams.nta.ac.in/AISSEE వెళ్లాలి.
- స్టెప్ 2: హోంపేజీలో 'AISSEE 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్' లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- స్టెప్ 4: లాగిన్ అయిన తర్వాత మీ AISSEE 2025 నగర సమాచార స్లిప్ హోమ్ స్క్రీన్‌పై కనబడుతుంది.
- స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం దీన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
AISSEE 2025 అర్హత ప్రమాణాలు (AISSEE 2025 Eligibility Criteria)
AISSEE పరీక్ష 2025కి హాజరయ్యే ముందు అభ్యర్థులు అర్హత ప్రమాణాలను ఇక్కడ చూడవచ్చు.
- 6వ తరగతి ప్రవేశం: అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుండి 12 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలు 6వ తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- 9వ తరగతి ప్రవేశం: అభ్యర్థులు అదే తేదీ నాటికి 13 నుండి 15 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల ుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సీట్లు అందుబాటులో ఉంటే బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.