తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పగటి పూట ఎండ తీవ్రంగా ఉంటుంది. దీంతో అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేడి కారణంగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఒంటిపూట బడులపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పెరుగుతన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి ఒంటిపూట బడులు ఉండే ఛాన్స్ ఉంది. అంటే తెలంగాణలో మార్చి 17, మార్చి 21 తేదీల్లో హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమై, ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలకావాల్సి ఉంది.
లేటేస్ట్ : ఏపీ ఒంటిపూట బడులు 2025
తెలంగాణ ఒంటిపూట బడుల డేట్స్, టైమింగ్స్ 2025 (TS Half Day School Date and Timings 2025)
తెలంగాణ ఒంటిపూట బడులు తేదీలు, టైమింగ్స్ 2025కు సంబంధించిన వివరాలు ఈ దిగువున పట్టికలో అందించాం.
అన్ని మేనేజ్‌మెంట్‌ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అంటే, ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని, మార్చి 17 లేదీ మార్చి 21 నుండి ఏప్రిల్ 23 వరకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ ఉత్తర్వుల్లో తెలిపారు.
వేసవిలో హాఫ్ డే పాఠశాలలకు టైమ్ టేబుల్ త్వరలో విడుదలవుతుంది. అంతేగాకుండా ఒంటిపూట బడులకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల్లోని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల అన్ని మేనేజ్‌మెంట్లకు విడుదల చేయబడతాయి. ఈ ఒంటిపూట బడుల సమయంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోని పిల్లలకు మెరుగైన మంచి నీటిని అందించాల్సి ఉంటుంది. అదే విధంగా విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా పాఠశాలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాఠశాలల బయట ఆవరణలో కానీ, చెట్ల కింద తరగతులు నిర్వహించకూడదు. ఒంటిపూట బడుల సమయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆరో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. పరీక్షల అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 23 తేదీ తర్వాత నుంచి ఉండనున్నాయి.