తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 అంచనా విడుదల తేదీ (TG Gurukul Exam Answer Key 2025 Expected Release Date) : రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి, 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఫిబ్రవరి 23, 2025న తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCET) నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 (TG Gurukul Exam Answer Key 2025) ఇంకా విడుదల కాలేదు. ఆన్సర్ కీ విడుదలయ్యే తేదీని ఇక్కడ అంచనాగా అందించాం.
తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025ని గురుకుల విద్యా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత అభ్యర్థులు ప్రశ్నాపత్రాలతో పాటు 5వ తరగతి, 6వ తరగతి ఆన్సర్ కీలను చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 అంచనా విడుదల తేదీ (TG Gurukul Exam Answer Key 2025 Expected Release Date)
తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 ఎప్పుడు విడుదలవుతుందో దిగువున టేబుల్లో అంచనాగా అందించాం.
TG CET 2025 5వ, 6వ, 7వ, 8వ తరగతి ఆన్సర్ కీ 2025ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
తెలంగాణ గురుకుల ఎగ్జామ్ ఆన్సర్ కీ 2025 ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అయి అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ఆన్సర్ కీని పొందవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక సైట్ tgcet.cgg.gov.inని సందర్శించాలి.
- హోంపేజీలో ఆన్సర్ కీ లింక్‌ను గుర్తించాలి.
- TG CET ఆన్సర్ కీ 2025 పై క్లిక్ చేయాలి.
- వివరాలను నమోదు చేయాలి.
- SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.
- భవిష్యత్తు సూచన కోసం TG CET ఆన్సర్ కీ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.