AP SSC కాంపోజిట్ తెలుగు విభాగం వారీగా అంచనా పత్రం 2025ను ఇక్కడ అందించాం.
విభాగము - 1: భాషాంశములు. పదజాలం వ్యాకరణం
అ) జనకుడు గ్రామమును చేరుకున్నాడు. గీత గీసిన పదానికి అర్థం రాయండి
ఆ) కుటుంబంలోని మర్మమును తెలుపరాదు- గీత గీసిన పదానికి అర్థం రాయండి.
ఇ) పక్షి ఆహారంలో విహరించింది. - గీత గీసిన పదానికి రెండు పర్యాయపదాలు రాయండి.
ఈ) కౌముది అంతట విస్తరించింది. గీత గీసిన పదానికి రెండు పర్యాయపదాలను రాయండి
ఉ) సంతానం కలిగింది - ఈ వాక్యంలో గీత గీత గీసిన పదానికి రెండు నానార్థ పదాలు రాయండి.
ఊ) పెద్దల పట్ల గౌరవం చూపాలి - ఈ వాక్యంలో గీత గీసిన పదానికి వికృతి పదం వ్రాయండి.
ఋ) మానవులు యథావిధిగా దానం చేయాలి- గీత గీసిన పదానికి సమాసం పేరును రాయండి.
ౠ) ప్రతిరోజు పుస్తకం చదవాలి - గీత గీసిన పదానికి సమానం పేరును kengcr
2.ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి సరైన సమాధానమును సూచించే పదాన్ని రాయండి.
అ) మా పొలంలో బంగారం పండింది- ఇందులోని అలంకారం గుర్తించి వ్రాయండి.
A) అతిశయోక్తి అలంకారం
B) రూపకాలంకారం
C) ఉపమాలంకారం
ఆ) యూరపు - ఇది ఏ గణమో గుర్తించి వ్రాయండి.
A) 'మ' గణము
B) 'జ' గణము
C) 'భ' గణము
II. అవగాహన - ప్రతిస్పందన
4. క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి.
శివరాజంతట మేల్మునుంగుఁ దెరలో స్నిగ్ధాంబంద చాయలో
నవ సౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ
రహముల్ వాఱఁగఁ జూచి వల్కె "వనితారత్నంబు లీ భవ్యహైం
దవభూజంగము పుణ్యదేవతలు: మాతా! తప్పు సైరింపుమీ!”
(లేదా)
తన దేశంబు స్వభాష నైజమతమున్ జన్మత్సదాచారముల్
తన దేహాత్మల నెత్తెఱంగున సదా తానట్లు ప్రేమించి, త
దనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
ననునౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!
III. వ్యక్తీకరణ సృజనాత్మకత
అ) ఈ క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యములు మించకుండా లఘు సమాధానాలు రాయండి.
8. వెన్నెల అందచందాలను చక్కగా ఆవిష్కరించిన 'వెన్నెల' పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
9. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వ్రాయండి.
10. జానపదుని జాబు అనే పాఠ్యభాగ రచయితను గూర్చి వ్రాయండి.
11. రావణుని పాత్ర స్వభావాన్ని గురించి వ్రాయండి.
12. ఆచార్య నాగార్జునుని గురించి రాయండి.
13. వక్త ఎప్పుడు అపహాస్యం పాలవుతాదు ?
14. వీరిక అనే ప్రక్రియను వివరించండి.
15. 'అన్నా! ఈ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది' అని పలికిన లక్ష్మణుని మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు?
16. అంగద రాయవార వృత్తాంతాన్ని వివరించండి.
ఆ) ఈ క్రింది ప్రశ్నలకు 10 వాక్యములు మించకుండా వ్యాసరూప సమాధానాలు రాయండి.
17. మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు గదా! దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
(లేదా)
సజ్జనుల యొక్క లక్షణాలను వివరించండి.
18.ఎల్లమ్మకు రచయిత్రికి గల అనుబందం గురించి వ్రాయండి.
(లేదా)
"సూక్తి సుధ" పాఠం ద్వారా మీరు గ్రహించిన విలువలను సొంతమాటల్లో వ్రాయండి.
19. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానాన్ని వివరించండి.
(లేదా)
శ్రీరామచంద్రుని గుణగణాలను సొంతమాటల్లో వ్రాయండి.
20. మీ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన స్త్రీ వాద రచయిత్రులను ఇంటర్వ్యూ చేయడానికి అనుగుణమైన ప్రశ్నావళిని రూపొందించండి:
(లేదా)
స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ కొన్ని నినాదాలు, సూక్తులు వ్రాయండి.