ప్రతి ఏడాది ఎండా కాలంలో విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించడం జరుగుతుంది. మార్చి నెల నుంచి ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఎండలు పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పిల్లలు ఎండ వేడిమికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఒంటిపూట బడులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపట బడులు మార్చిలో ప్రారంభంకానున్నాయి. గత సంత్సరాల అనుసరించి మార్చి 10 నుంచి లేదా మార్చి 17వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో రానుంది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు మార్చిలో ప్రారంభమై.. విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు అంటే ఏప్రిల్ 23, 2025 వరకు ఉంటుందని ఏపీ విద్యాశాఖ త్వరలో ప్రకటించనుంది. రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తించనుంది.
లేటేస్ట్ : తెలంగాణ ఒంటిపూట బడులు 2025 ఎప్పటినుంచంటే?
ఒంటిపూట బడులు అంశాన్ని ఇప్పటికే అధికారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దగ్గర ప్రస్తావించిన్టు సమాచారం. దీంతో మార్చి 10వ తేదీ లేదా 17వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
ఏపీ వేసవి ఒంటిపూట బడుల టైమ్ టేబుల్ (AP Summer Half Day School Time Table)
ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించవచ్చు.
వేసవిలో ఒంటిపూట బడులకు సంబంధించిన మార్గదర్శకాలు 2025 (Guidelines for Conducting Half Day During Summer 2025)
ప్రతి ఏడాది వేసవిలో ఒంటిపూట బడుల నిర్వహణలో పాఠశాల అధికారులకు కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్గదర్శకత్వాలను ఈ దిగువున అందించాం.
- అన్ని పాఠశాలల్లో విద్యార్థుల కోసం తగినంత తాగునీరు అందించాలి.
- బహిరంగ ప్రదేశాలలో లేదా చెట్ల కింద తరగతులు నిర్వహించకూడదు.
- పాఠశాలలో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా పిల్లల కోసం కొన్ని ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
- మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగను అందించే ప్రయత్నం చేయాలి.
- పాఠశాల సమయం ముగిసే సమయానికి మధ్యాహ్న భోజనం తయారు చేసి విద్యార్థులకు అందించాలి. అనంతరం విద్యార్థులను వారి ఇళ్లకు పంపాలి.