APRJC CET 2025 నోటిఫికేషన్ ఎక్స్‌పెక్టెడ్ డేట్ (APRJC CET 2025 Notification Expected Date) : APRJC CET 2025 అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APREI) APRJC CET 2025 నోటిఫికేషన్ (APRJC CET 2025 Notification Expected Date) రిలీజ్ చేస్తుంది. APRJC CET 2025 దరఖాస్తు ఫార్మ్ మార్చి 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. APRJC CET 2025 పరీక్ష ఏప్రిల్ 2025లో ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. MPC/BiPC/ MEC/CEC వంటి ఇంటర్ కోర్సులకు మొదటి సంవత్సరం జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRJC CET) నిర్వహించడం జరుగుతుంది. APRJC CET 2025లో సాధించిన మార్కుల ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులకు సీట్లను అందించే మొత్తం 10 APRJC CETని అంగీకరించే కాలేజీలు ఉన్నాయి.వెనుకబడిన విద్యార్థులకు తక్కువ ఫీజులతో కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ APRJC CET 2025 పరీక్షను నిర్వహిస్తుంది.
APRJC CET 2025 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2025 Important Dates)
APRJC CET 2025 ముఖ్యమైన తేదీలను అంచనాగా ఈ దిగువన అందించాం.
APRJC CET 2025 గైడ్‌లైన్స్ (APRJC CET 2025 Guidelines)
APRJC సెట్ 2025కు సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
- అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందు APRJ CET 2025 పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- పరీక్షకు హాజరయ్యే వారు పరీక్షా హాలుకు హాల్ టిక్కెట్లతో పాటు అవసరమైన ఇతర ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
- హాల్ టికెట్ లేకుండా ఏ విద్యార్థినీ పరీక్ష హాల్లోకి అనుమతించరు.
- ఇది ఆఫ్‌లైన్ పరీక్ష కాబట్టి, అభ్యర్థులు పరీక్షా హాలుకు నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్నును తీసుకెళ్లవచ్చు.
- కండక్టింగ్ అథారిటీ చేసిన సీటింగ్ అమరిక ప్రకారం విద్యార్థులు కూర్చోవాలి.
- పరీక్షార్థులు OMR షీట్‌లో పేర్కొన్న అన్ని సూచనలను చదవాలి. కచ్చితంగా పాటించాలి.
- పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 2:30 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతుంది, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దానిని తెలివిగా ఉపయోగించుకోండి.