CUET UG 2025 అధికారిక వెబ్‌సైట్ (CUET UG 2025 Official Website) : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) UG 2025 అధికారిక వెబ్‌సైట్ (CUET UG 2025 Official Website) ప్రారంభమైంది. CUET UG 2025 దరఖాస్తు ప్రక్రియ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు అప్లికేషన్ ఫార్మ్ https://cuet.nta.nic.in/లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఈ నెలలో అంటే ఫిబ్రవరిలోనే 2025 ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10, 2025 అని చెప్పబడింది. CUET UG 2025 కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక లింక్ (CUET UG 2025 Official Website), CUET UG నోటిఫికేషన్ 2025 వివరాలు ఇక్కడ అందించాం.
CUET UG 2025 అధికారిక వెబ్‌సైట్ లింక్ (CUET UG 2025 Official Website Link)
CUET UG 2025 ముఖ్యమైన తేదీలు (CUET 2025 Important Dates)
CUET UG 2025కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
CUET 2025 విద్యార్హతలు (CUET UG 2025 Education Qualification)
CUET 2025కి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందించాం.
- జనరల్ కేటగిరీ: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- SC/ST అభ్యర్థులు : SC, ST చెందిన అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
- 2025లో ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే కౌన్సెలింగ్ ప్రక్రియ సమయంలో వారు తమ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.