తెలంగాణ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు సిలబస్ మార్పు : తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుండి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో గణనీయమైన మార్పులు తీసుకునిరావడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలకు ఒకే కోర్సుకి ఒకే సిలబస్ ఉండేలా విధానాన్ని రూపొందిస్తుంది. ఈ విధానం బి.టెక్ , బి.ఫార్మసి, Bsc, బి.కాం మొదలైన అన్ని అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీలు ఇప్పటి వరకు వివిధ సిలబస్ లను అనుసరిస్తూ ఉన్నాయి, అయితే విద్యార్థులలో నైపుణ్యత స్థాయి పెంచేలాగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అందరికీ ఉద్యోగం లభించాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) నాలుగు సిలబస్ కమిటీలను ఏర్పాటు చేసింది. సిలబస్ లో మార్పులతో పాటుగా 150 క్రెడిట్ పాయింట్స్ తో క్రెడిట్ సిస్టంను కూడా అమలుచేయడానికి సిద్దమవుతుంది. ఈ క్రెడిట్స్ లో సెమినార్ల కోసం 2 క్రెడిట్స్ , ప్రాజెక్ట్ కి మరియు ఇంటర్న్షిప్ కి 5 క్రెడిట్ల చొప్పున కేటాయించనున్నారు. అంతే కాకుండా యూనివర్సిటీ లెవల్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ మరియు వర్క్ షాప్స్ నిర్వహిస్తారు.
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో సిలబస్ మార్చడంతో పాటుగా ఉపాధి/ఉద్యోగ అవకాశాలను పెంచే కొన్ని కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు, వీటిలో ముఖ్యంగా
Bsc అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫోరెన్సిక్ సైన్స్ , ఫారెస్ట్రీ , కంప్యుటేషనల్ ఫార్మకాలజీ, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి కోర్సులు ఉన్నాయి. DOST ప్రోగ్రాం ద్వారా డిగ్రీలో ఒక కోర్సు ఎంచుకున్న వారు మరో కోర్సులో సబ్జెక్ట్స్ ఎంచుకునే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు సిలబస్ కమిటీలలో మేనేజ్మెంట్, లా కోర్సుల కమిటీ ఛైర్మన్ గా బాలకృష్ణ రెడ్డి, Bsc సైన్స్ కోర్సుల కమిటీ చైర్మన్ గా మహమ్మద్ , ఆర్ట్స్ కోర్సుల కమిటీ ఛైర్మన్ గా పురుషోత్తం, ఇంజనీరింగ్ కోర్సుల కమిటీ ఛైర్మన్ గా శ్రీరామ్ వెంకటేష్ నేతృత్వం వహించనున్నారు.
తెలంగాణ అండర్ గ్రాడుయేషన్ లో సిలబస్ మారే కోర్సుల జాబితా
గమనిక : పైనవివరించిన మార్పులు పూర్తి స్థాయిలో నిర్వహించడం సిలబస్ కమిటీలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.