తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ 2025 (Telangana Bsc nursing admission 2025) : తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ (Telangana Bsc nursing admission 2025) పొందడానికి నీట్ యూజీ 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. నర్సింగ్ రంగంలో రాణించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అయితే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం ఎలా ప్రయత్నించాలో తెలియకపోవడం వల్ల గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా మెడికల్‌కి సంబంధించిన ఏ కోర్సులోనైనా జాయిన్ అవ్వాలంటే కచ్చితంగా NEET UG 2025 క్వాలిఫై అవ్వాలని భావిస్తుంటారు.అయితే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు ఏం చేయాలో పూర్తి వివరాలను ఇక్కడ అందించాం. అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: ఏపీలో B.Sc నర్సింగ్ అడ్మిషన్ కోసం NEET UG 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా?
తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం NEET UG 2025లో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి కాదు. నీట్ 2025 స్కోర్‌తో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ ఎంసెట్ ద్వారా ప్రముఖ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్ పొందవచ్చు. TS EAMCET స్కోర్‌లు లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అయితే, కొన్ని ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రవేశం కల్పిస్తాయి.
తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం ఉండాల్సిన అర్హతలు (Telangana BSc Nursing Admissions Eligibility Requirements)
తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను ఈ దిగువున అందించడం జరిగింది.
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
- తెలంగాణ ఎంసెట్‌లో (TS EAMCET 2025) లో క్వాలిఫై ఉండాలి.
- తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డుని, హాల్ టికెట్‌ని కచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌లో సైన్స్ (PCBE)లో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) / ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి.
- అభ్యర్థుల కనీస వయసు 17 సంవత్సరాలు ఉండాలి
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను TS EAPCET అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం అభ్యర్థులు కచ్చితంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో తమ ప్రొవిజనల్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్లు కోసం అభ్యర్థులు ఎంసెట్‌లో సాధించాల్సిన కటాఫ్ స్కోర్ (Cut-off score in TS-EAPCET-2024 for B.Sc(Nursing))
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లకు అర్హత సాధించడానికి అభ్యర్థులు TG- EAPCETలో ఇక్కడ తెలిపిన కటాఫ్ స్కోర్‌లు లేదా అంతకంటే ఎక్కువ సాధించాలి.