ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ 2025 (Andhra Pradesh Bsc Nursing Admission 2025) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ (Andhra Pradesh Bsc Nursing Admission 2025) పొందడానికి నీట్ యూజీ 2025లో కచ్చితంగా క్వాలిఫై అవ్వాలా? అనే అనుమానం చాలా మంది అభ్యర్థుల్లో ఉంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.నిజానికి ప్రతి ఏడాది నర్సింగ్ రంగంలో రాణించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అయితే బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల కోసం ఎలా ప్రయత్నించాలో తెలియకపోవడం వల్ల అయోమయానికి గురవుతుంటారు. ముఖ్యంగా మెడికల్‌కి సంబంధించిన ఏ కోర్సులోనైనా జాయిన్ అవ్వాలంటే కచ్చితంగా NEET UG 2025 క్వాలిఫై అవ్వాలని భావిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు ఏం చేయాలో పూర్తి వివరాలను ఇక్కడ అందించాం.
ఇది కూడా చూడండి: తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ 2025 కోసం నీట్‌లో క్వాలిఫై అవ్వాలా?
ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాల (Andhra Pradesh Bsc Nursing Admission 2025) కోసం NEET UG 2025లో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి కాదు. నీట్ 2025 స్కోర్‌తో సంబంధం లేకుండా కేవలం ఏపీ ఎంసెట్ ద్వారా ప్రముఖ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్ పొందవచ్చు. AP EAMCET స్కోర్‌లు లేదా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అయితే, కొన్ని ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రవేశం కల్పిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం ఉండాల్సిన అర్హతలు (Andhra Pradesh BSc Nursing Admissions Eligibility Requirements)
ఆంద్రప్రదేశ్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాల కోసం (Andhra Pradesh Bsc Nursing Admission 2025) అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను ఈ దిగువున అందించడం జరిగింది.
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
- ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET 2025) లో క్వాలిఫై ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) / ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి.
- OC అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులకు తగ్గకుండా పొందాలి.
- BC/SC/ST అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులలో 40 శాతం మార్కులకు తగ్గకుండా పొందాలి.
- అభ్యర్థుల కనీస వయసు 17 సంవత్సరాలు ఉండాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.