గేట్ రెస్పాన్స్ షీట్ 2025 విడుదల తేదీ (GATE Reponse Sheet 2025 Release Date) : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ GATE 2025 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)ని ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించింది. దీంతో అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే చివరి పరీక్ష జరిగిన 10 రోజుల్లోపు అంటే ఫిబ్రవరి 21, 22 2025 నాటికి అధికారి GATE రెస్పాన్స్ షీట్ 2025ను (GATE Reponse Sheet 2025 Release Date) విడుదల చేసే అవకాశం ఉంది. GATE పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ రెస్పాన్స్ షీట్‌లు https://gate2025.iitr.ac.in/లో విడుదల చేస్తారు. GATE రెస్పాన్స్ షీట్ ద్వారా అభ్యర్థులు పరీక్షలో గుర్తించిన ప్రతిస్పందనలు ఉంటాయి, తద్వారా అభ్యర్థులు తమ సమాధానాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: గేట్ 2025 ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
గేట్ రెస్పాన్స్ షీట్ 2025 విడుదల తేదీ (అంచనాగా) (GATE Reponse Sheet 2025 Release Date)
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వారి సంబంధిత GATE రెస్పాన్స్ షీట్ 2025 https://gate2025.iitr.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. రెస్పాన్స్ షీట్ విడుదల తేదీని ఇక్కడ అందించాం.
గేట్ రెస్పాన్స్ షీట్ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download GATE Response Sheet 2025)
అభ్యర్థులు GATE రెస్పాన్స్ షీట్ 2025ని ఈ దిగువున తెలిపిన విధానంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చెక్ చేయవచ్చు.
- ముందుగా అభ్యర్థులు IIT రూర్కీ అధికారిక గేట్ 2025 వెబ్‌సైట్‌ను https://gate2025.iitr.ac.in సందర్శించాలి.
- హోంపేజీలో లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ ఆధారాలను, అంటే రిజిస్ట్రేషన్ ID, పాస్‌వర్డ్ లేదా ఈ మెయిల్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- అభ్యర్థులు పాస్‌వర్డ్ బాక్స్ కింద ఉన్న బాక్స్‌లో చూపిన కాప్చాను ఎంటర్ చేసి ఆపై వ్యూ రెస్పాన్స్‌పై క్లిక్ చేయాలి.
- GATE రెస్పాన్స్ షీట్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్ రికార్డుల కోసం గేట్ 2025 రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దగ్గర ఉంచుకోవాలి.