GATE 2025 ఆన్సర్ కీ విడుదల తేదీ (GATE 2025 Answer Key Release Date) : GATE 2025 పరీక్ష (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ఫిబ్రవరి 16, 2025న ముగిసింది. దీంతో అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం చూస్తున్నారు. ఈ అధికారిక ఆన్సర్ కీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), రూర్కీ విడుదల చేస్తుంది. సాధారణంగా GATE ఆన్సర్ కీ (GATE 2025 Answer Key Release Date)
పరీక్ష పూర్తైన 10 రోజుల తర్వాత విడుదల చేయబడుతుంది. ఈ మేరకు GATE ఆన్సర్ కీ 2025 ఫిబ్రవరి 26, 2025 నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆన్సర్ కీ విడుదలైన వెంటనే కచ్చితంగా డౌన్‌లోడ్ లింక్‌కు సంబంధించిన వివరాలను అందిస్తాం. అభ్యర్థులు ఆన్సర్ కీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
ఇది కూడా చదవండి: గేట్ రెస్పాన్స్ షీట్ 2025 విడుదల తేదీ
గేట్ 2025 ఆన్సర్ రిలీజ్ డేట్ (GATE 2025 Answer Key Release Date)
గేట్ 2025 ఆన్సర్ కీ విడుదల తేదీకి (GATE 2025 Answer Key Release Date) సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
గేట్ ఆన్సర్ కీ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download GATE Answer Key 2025)
గేట్ ఆన్సర్ కీ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించాం. విడుదలైన తర్వాత ఇక్కడ తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), రూర్కీ అధికారిక వెబ్‌సైట్‌ను https://gate2025.iitr.ac.in/. సందర్శించాలి.
- “మాస్టర్ ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
- అన్ని సబ్జెక్టులకు సంబంధించిన గేట్ ఆన్సర్ కీ 2025 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు సూచన కోసం GATE సమాధాన PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- తర్వాత మీ సమాధానాలతో సరిపోల్చుకుని చూసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.